దెందులూరు మండలం జోగన్నపాలెం ఎంపిపి పాఠశాలలో విద్యార్థులు బుధవారం మధ్యాహ్న భోజనంలో ఉడకని బంగాళా దుంప కూర తినటం వల్ల వారిలో 9 మంది చిన్నారులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారిని గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించి మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు.