దెందులూరు మండలం కొత్తగూడెంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన పెరికే వెంకటరత్నం, సతీష్ దంపతులు నివాసం ఉంటున్న తాటాకు ఇల్లు కాలిపోయింది. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. తాటాకు ఇల్లు కావడంతో నగదు, బంగారం పూర్తిగా దగ్ధమైందని బాధితులు వాపోయారు. భీమడోలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థాలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.