పేదల భూములను భూస్వాములకు కట్టబెట్టేలా మండల రెవెన్యూ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ , దోసపాడు భూ పోరాట కమిటీ ఆరోపించింది. దోసపాడు భూ పోరాట కమిటీ సమావేశం ఆనందరావు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ. దోసపాడు దళితులు, పేదలు గత కొంతకాలంగా అసైన్మెంట్, సీలింగ్ భూములు కోసం పోరాడుతున్నారన్నారు.