ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ విప్లవ మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు జూలై 4 1897 ఆంధ్ర ప్రదేశ్ లో భీమవరం వద్దగల మెగళ్లలో జన్మించినారని మే 7, 1924 మరణించారని బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా 1922లో రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించారన్నారు. గెరిల్లా యుద్ధంలో శక్తివంతమైన వ్యూహకర్తగా గుర్తింపు పొందారని పోడు వ్యవసాయం గిరిజనుల యొక్క హక్కులను గురించి అహర్నిశలు బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలిచిన మహా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు డిటిసి డిఎస్పీ కే ప్రభాకర్ రావు, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.