ఏలూరు ఆర్ఆర్ పేటలో జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ కార్యకర్తలు శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి. కిషోర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కరెంటు చార్జీలు రద్దు చేస్తామని హామీని ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక విద్యుత్ శాఖ చార్జీలు పెంచుతూ ప్రతిపాదనలు పెట్టిందని అన్నారు. ఇది అమలు అయితే ప్రజలపై 20 వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అన్నారు. కాగా చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.