1200 మందికి నిత్యవసరాలు పంపిణీ

69చూసినవారు
1200 మందికి నిత్యవసరాలు పంపిణీ
వరద విపత్తులో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తం అందించేందుకు ఏలూరులోని మన్నా చర్చి ఆధ్వర్యంలోని జ్యోతిరాజు ఫౌండేషన్‌ ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో తలెత్తిన వరద విపత్తులో చిక్కుకుని అనేక ఇబ్బందులు పడుతోన్న బాధితుల సహాయార్ధం గురువారం 1200 మందికి సరిపడా నిత్యవసరాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్