ఏలూరు: వేలేరుపాడు మండలంలోని రుద్రం కోట గ్రామంలో పవిత్ర గోదావరి నది తీరాన కొలువైయున్న అభయ ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం 10వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు భాస్కర శాస్త్రి, నందీశ్వర్ శర్మ, యశస్వి ల ఆధ్వర్యంలో ఉదయం నుంచి మూల విరాట్ కి ప్రత్యేక అభిషేకాలు భక్తజన సందోహం మధ్య శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. అనంతరం ఆకు పూజ , కుంకుమ పూజ వంటి కార్యక్రమాలను కొనసాగించారు.