Top 10 viral news 🔥

మణిపూర్ సీఎం రాజీనామా
మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. తొలుత ఆదివారం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందజేశారు. కొంతకాలంగా మణిపూర్ అల్లర్లుతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక విమర్శలు ఎదుర్కొవడంతో తాజాగా ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.