దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో సన్న బియ్యంతో తయారుచేసిన మధ్యాహ్న భోజన పథకం వంటలను తహశీల్దార్ సుమతి, ఎంఈఓ 2 అన్నమ్మ గురువారం పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం వంటలను రుచి చూడటంతో పాటు విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నాయి. దెందులూరు మండలంలోని ప్రాథమిక పాఠశాలలలో తొలిరోజు పదిహేను నుండి 35% వరకు హాజరు నమోదైందని తెలిపారు.