ఏలూరు జిల్లాలో యువతకు ఉచిత శిక్షణ

85చూసినవారు
ఏలూరు జిల్లాలో యువతకు ఉచిత శిక్షణ
యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో యువతకు చరవాణుల మరమ్మతులపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ సంచాలకుడు శశిధర్ గురువారం తెలిపారు. పదో తరగతి ఆపై చదివి, 19-45 సంవత్సరాల వయసు కలిగిన గ్రామీణ ప్రాంత యువత అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని, అర్హత కలిగిన వారు ఏలూరు సత్రంపాడులోని సంస్థలో సంప్రదించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్