ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలి

63చూసినవారు
ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలి
ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం సొమ్ములివ్వకపోతే సార్వా సాగు చేయలేమంటూ రైతులు కలెక్టరేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్