మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన శిక్షలు తప్పవని ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఏలూరు నగరంలోని స్థానిక అమీనాపేటలోని శ్రీ స్వామి దయానంద ఆశ్రమంలో లైంగిక వేధింపులకు గురైన బాలికకు ప్రభుత్వం అన్ని విధానా అండగా ఉంటుందన్నారు. మహిళలతో అందరూ గౌరవంగా నడుచుకోవాలని సూచించారు.