ఏలూరు డీఎంహెచ్వో కార్యాలయంలో ఉమ్మడి ప. గో. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న లాబ్ టెక్నీషియన్స్ సమీక్షా సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డా. శర్మిష్ఠ, డిఎమ్ఓ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. లాబ్ టెక్నీషియన్స్ కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారని, భవిష్యత్తులో లాబ్ టెక్నిషన్స్ సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.