చెరకు టన్నుకు 9. 5 రికవరీ శాతంపై రూ. 4వేలు మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ద్వారకాతిరుమల మండలం తక్కెళ్ళపాడు, గుణ్ణంపల్లి గ్రామాలలో రైతులు సాగు చేస్తున్న చెరకు పంటను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ. చెరకు రైతులను ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.