ముదినేపల్లిలో తొలిరోజు 97 శాతం పింఛన్లు పంపిణీ

84చూసినవారు
ముదినేపల్లిలో తొలిరోజు 97 శాతం పింఛన్లు పంపిణీ
ముదినేపల్లి మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛను నగదును గురువారం 97శాతం పంపిణీ చేశారు. మొత్తం 9022 మందికిగాను సాయంత్రం 6 గంటలకు 8681 మందికి పింఛన్లు పంపిణీ జరిగింది. తెల్లవారుజామున 5. 30గంటలకే అధికారులు, సచివాలయ సిబ్బంది, నాయకులు లబ్దిదారులు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. వడాలిలో టిడిపి నియోజకవర్గ సమన్వయకమిటీ అధ్యక్షుడు వీరమల్లు నరసింహారావు, ఎంపీడీఓ మురళీగంగాధరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్