మండవల్లి మండలంలోని మొత్తం 6946 పింఛన్ల లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే 1వ తేదీన ఉదయం 5 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో బేబీ శ్రీలక్ష్మి తెలిపారు. మండలంలో వికలాంగులకు రూ. 6వేలు, మిగతా లబ్ధిదారులకు రూ. 4వేలు చొప్పున మొత్తం రూ. 2, 38, 24, 500 పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మండలంలోని పింఛన్ల లబ్ధిదారులు అందరూ గురువారం ఉదయం సచివాలయ సిబ్బందికి అందుబాటులో ఉండి సహకరించాలన్నారు.