ఏలూరు జిల్లావ్యాప్తంగా ఈ నెల 6 నుంచి చేపట్టనున్న మెడికల్ పింఛన్ల రీ-వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం ఏలూరులో నిర్వహించిన జిల్లా కో-ఆర్డినేషన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ. గుంటూరు నుంచి జిల్లాకు మూడు బృందాలు వస్తాయని, ఒక్కో బృందంలో ఒక ఆర్థోపెడిక్ డాక్టరు, ఒక జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు, జిల్లాకు చెందిన మరో వైద్యాధికారి ఉంటారన్నారు.