ముదినేపల్లి మండల ఎమ్మార్వోగా ఎస్కే లతీఫ్ బాషా గురువారం బాధ్యతలు చేపట్టారు. మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు డిప్యూటీ ఎమ్మార్వో పవన్ కుమార్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను వీఆర్వోలు, వీఆర్ఎలు, కార్యాలయ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.