బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

74చూసినవారు
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ముదినేపల్లి మండలం గురజలో మైనర్ బాల్య వివాహాన్ని గురువారం రాత్రి అధికారులు అడ్డుకున్నారు. గురజకు చెందిన యువకుడికి గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతంకు చెందిన మైనర్ బాలికకు వేణుగోపాలస్వామి ఆలయంలో వివాహం జరుగతుందని అధికారులకు సమాచారం అందింది. దీంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఝాన్సీ, పోలీసులు పెళ్లి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. పెళ్లికుమార్తెకు 17ఏళ్ల వయస్సుగా అధికారులు గుర్తించి పెళ్లి ఆపేశారు.
Job Suitcase

Jobs near you