రజకులను ఎస్సి జాబితాలో చేర్చి ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. గురువారం స్వాతంత్ర సమరయోధురాలు చిట్యాల ఐలమ్మ 129 వ జయంతిని కైకలూరు లో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజకులు వృత్తి నిర్వహించుకునే చెరువులు పై శాశ్వత హక్కులు కల్పించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని రామకృష్ణ అన్నారు. ఎన్డీయే నాయకులు తదితరులు పాల్గొన్నారు.