మండవల్లి మండలంలోని ఉనికిలి పంచాయతీ కార్యదర్శిని దుర్భషలాడి, విధులకు అటంకపరచడమేకాక వీఆర్వోపై దాడి చేసిన నిందితుడ్ని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామచంద్రరావు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి రాధిక సచివాలయంలో ఉండగా గ్రామానికి చెందిన కలంకూరి వెంకటరత్నం అక్కడకు వచ్చి పంచాయతీ చెరువు పాటల విషయంపై ఆమెతో గొడవపడ్డాడు. ఆమెను అసభ్యకరంగా దూషిస్తుండగా అడ్డుకున్న వీఆర్వో శ్రీనివాసరావుపై దాడి చేశాడని తెలిపారు.