ప్రతి ఒక్కరు నవ సమాజస్థాపన కోసం ఫూలే అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే డిఎన్నార్ అన్నారు. గురువారం ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తో కలసి కైకలూరులోని కోరుకొల్లు, కలిదిండి శ్రీ జ్యోతిరావ్ ఫూలే సెంటర్ లో జ్యోతిరావ్ ఫూలే 198వ జయంతి మహోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహాత్మా ఫూలే విగ్రహనికి మండల నాయకులు, గ్రామ నాయకులతో కలసి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు.