మైలవరంలో 88వేల రూపాయల విలువ గల 22కేజీల గంజాయిని పోలీసులు మంగళ వారం స్వాధీనం చేసుకున్నారు. 6గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దొంగిలించ బడిన 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసు కున్నట్లు పోలీసులు తెలిపారు. ఏజెన్సీలో కేజీ 4వేలకు కొనుక్కు వచ్చి 20నుండి 30వేలకు విక్రయి స్తున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. ఎంతటి వారైనా వదిలేది లేదన్న జిల్లా రూరల్ డీసీపీ శ్రీనివాస రావు హెచ్చరించారు