నరసాపురంలో 48 మందిపై కేసు నమోదు

54చూసినవారు
నరసాపురంలో 48 మందిపై కేసు నమోదు
నరసాపురం టౌన్‌ 29 వార్డు అరుంధతి పేటలో ఇరువర్గాలు దాడిచేసుకున్న ఘటనలో శనివారం రెండు కేసులు నమోదు చేశామని సీఐ యాదగిరి తెలిపారు. సీఐ వివరాల ప్రకారం. రెల్లిపేటకు చెందిన ఆకుల నిఖిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు 26 మందిపై కేసు నమోదు చేశామన్నారు. అరుంధతి పేటకు చెందిన బస్వాని మిస్సమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెల్లిపేటకు చెందిన 22మందిపై కేసు నమోదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్