నరసాపురం పట్టణం 29వార్డు అరుంధతి పేటలో శుక్రవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నాయి. ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గొడవకు కారణాలపై డీఎస్పీ శ్రీవేద ఇరువర్గాలతో చర్చిస్తున్నారు.