నరసాపురంలో 120 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన
నరసాపురం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్టీమర్ రోడ్ నుంచి శివాలయం సెంటర్ మీదుగా అంబేడ్కర్ సెంటర్ వరకు 120 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. డా. బీఆర్. అంబేడ్కర్, గాంధీ, వైఎస్సార్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు.