మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ బండి ముత్యాలమ్మ తల్లిని శనివారం కృష్ణా జిల్లా పెనమలూరు క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రాపేటి గోవిందరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మోకా అరుణ్ కుమార్ వారికి ప్రత్యేక పూజలు చేయించారు. వీరితో పాటుగా చైర్మన్ కడలి మాణిక్యాలరావు, మొగల్తూరు మండలం చిరు పవన్ యూత్ అధ్యక్షుడు దాసరి కృష్ణా, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.