జిన్నూరు పంట కాలువలో చనిపోయిన కోళ్లను సంచుల్లో మూటలుగా కట్టి కాలువలో పడేస్తునారు. గత కొన్ని రోజులుగా కాలువలో చనిపోయిన కోళ్ల మూటలు కాలువ వెంబడి కొట్టుకురావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం మండలం కొప్పర్రు, మల్లవరం గ్రామాల్లో కాలువను సోమవారం జలవనరులశాఖ డీఈఈ సీహెచ్. వెంకట నారాయణ పరిశీలించారు. పంట కాలువల్లో పడేసే కోళ్ల ఫారాలపై చట్టప్రకారం చర్యల తీసుకుంటామని హెచ్చరించారు.