నరసాపురం: రుస్తుంబాద డ్రెయిన్‌పై ఆక్రమణలు తొలగించి, డ్రెయిన్‌లో పూడికతీత పనులు చేపట్టాలని మూడు గ్రామాల రైతులు గురువారం ధర్నా చేపట్టారు. అనంతరం ర్యాలీగా జనసేన కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే నాయకర్‌కు, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎఒ పెద్దిరాజుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా యర్రంశెట్టివారిపాలెం మాజీ సర్పంచి కలవకొలను తాతాజీ మాట్లాడుతూ డ్రెయిన్ పొడవునా సుమారు 3 కి. మీ. మేర ఆక్రమణలకు గురైందన్నారు.