నరసాపురం శ్రీ సూర్య డిగ్రీ కళాశాల నుండి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఆదికవి నన్నయ యూనివర్శిటీ క్రికెట్ టీంకు మంగళవారం జరిగిన సెలక్షన్స్ లో శ్రీ సూర్య డిగ్రీ కళాశాల విద్యార్థి స్థానం సంపాదించాడు. బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి భోగరాజు సాయి సుశాంత్, ఆది కవి నన్నయ యూనివర్శిటీ క్రికెట్ టీంలో ఫాస్ట్ బౌలర్ & మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా ఎంపికయ్యాడు.