ప. గో.: కేంద్ర మంత్రిని కలిసిన రజక సంఘం నేతలు

67చూసినవారు
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మని ఉమ్మడి ప. గో. జిల్లా రజక సంఘం అధ్యక్షుడు పోసిబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్