కార్మికుల పోరాడి తెచ్చుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ బుధవారం డిమాండ్ చేశారు. మొగల్తూరులో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులు ఉద్యోగులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.