నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ను ఆర్టీసీ నాయకులు శుక్రవారం గౌరవప్రదంగా కలిశారు. కార్యక్రమంలో భాగంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమం అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ. నరసాపురం ఆర్టీసీ డిపోని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై. వి. రావు, నిషారుద్దీన్, శివ సతీష్ తదితరులు పాల్గొన్నారు.