నూజివీడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీసు నందు ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కూటమి కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని తమ యొక్క దేశ భక్తిని చాటుకున్నారు. తమ తమ వార్డుల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, కార్యకర్తలకు బాలికలకు బాలురకు వృద్దులకు వికలాంగులకు స్వీట్స్ పంచారు. నూజివీడు గుర్రం గేటు వద్ద ఆర్డీఓ జెండా ఎగుర వేశారు.