నూజివీడు నియోజకవర్గం లో గురువారం మంత్రి పార్థసారథి సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఉదయం 6 గంటలకు ముసునూరు మండలం గోపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత కాట్రేనిపాడు గ్రామాల్లో పింఛన్ పంపిణీలో పాల్గొంటారు. నూజివీడు మండలం అన్నవరం పింఛన్ల పంపిణీలో హాజరవుతారు, పట్టణంలోని మార్కెట్ యార్డు సందర్శిస్తారని నూజివీడు క్యాంప్ కార్యాలయం తెలిపింది.