ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పై అవగాహన కలిగి ఉండాలని నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ అన్నారు. నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కనసనపల్లి గ్రామంలో ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు.