చరిత్రలో ముషారఫ్, హిట్లర్ వంటివారు కూడా చేయని నియంత పాలన జగన్ చేశారని అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాలకొల్లులో అన్న క్యాంటీనన్ను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అన్న క్యాంటీన్లను జగన్ పాలనలో ధ్వంసం చేశారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని చెప్పారు.