నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో ఆదివారం జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో క్రాప్ హాలిడే పై ఆక్వా రైతు సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫీడ్ రేట్లు తగ్గకపోవడం, రొయ్య కౌంటు రేటు పెరగకపోవడం, రొయ్య కౌంటు రేటు వేరియేషన్స్ సరిలేకపోవడంతో జులై నెల నుండి మూడు నెలలు క్రాప్ హాలీడే అమలు చేయనున్నామని ఆక్వా రైతులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు.