పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షునిగా పాలకొల్లుకి చెందిన బండి రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వైసీపీ అధిష్టానం నుంచి ఓ ప్రకటన విడుదల అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత తన మీద నమ్మకంతో ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. పలువురు వైసీపీ నాయకులు రమేష్‌కు అభినందనలు తెలిపారు.