పాలకొల్లు పట్టణం గాంధీబొమ్మల సెంటర్ లో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మరుధూరి నర్సింహాచార్యులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారికి పంచామృతాభిషేకాలు, గోత్ర నామార్చనలు, పుష్పార్చన నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.