పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ పాలకొల్లు నియోజకవర్గం కూటమి ముఖ్య నాయకులతో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం పరిశీలకులు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర పాల్గొని మాట్లాడారు. అనంతరం కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.