పాలకొల్లు: పంచముఖ అంజనేయునికి తిరుమంజనం

56చూసినవారు
పాలకొల్లు పట్టణం యడ్ల బజారులో కొలువై ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో మే నెల 21 నుండి 25 వ తేదీ వరకు శ్రీ హనుమజ్జయంతి మహోత్సవములు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఆదివారం ఆలయ ప్రధానర్చకులు రమణ గురుస్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి తిరుమంజనం (అభిషేకం ) నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.