యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. బెల్ట్ షాపు నిర్వహిస్తున్న డి. చిరంజీవిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎస్. రాంబాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడిలో ఎస్‌ఐ ఎండీ. జైనులాబ్దిన్, సిబ్బంది పాల్గొన్నారు.