యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామ శివారులోని పంట కాలువలో శుక్రవారం గుర్తుతెలియని వృద్ధురాలు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 65 నుంచి 70 సంవత్సరాలు ఉంటుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను తెలిసినవారు 94407 96672 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు తెలిపారు.