వేలూరుపాడు మండలంలో వైసీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు గురువారం పర్యటించారు. పెదవాగు ప్రాజెక్టు వరద వలన ముంపునకు గురైన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా 93 కుటుంబాలకు వంట పాత్రలు అందించారు. వీరికి ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం కింద రూ. 25 వేల ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. మేడేపల్లి వద్ద పక్కా ఇల్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.