ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన సంకురమ్మ అనే మహిళ తాను కువైట్‌లో ఇబ్బందులు పడుతున్నట్లు గురువారం సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తినడానికి సరైన తిండి లేదని, నరకయాతన అనుభవిస్తున్నానని, ఎలాగైనా తిరిగి స్వగ్రామానికి వచ్చేలా చూడాలని కోరింది. ఆ వీడియో చూసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి సంకురమ్మను స్వగ్రామానికి తీసుకువస్తానని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.