అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన 13 మంది పాత నేరస్తులను గురువారం తాడేపల్లిగూడెం తహశీల్దార్ కోర్టులో హాజరు పరిచినట్లు ఎక్సైజ్ సీఐ ఇ. స్వరాజ్యలక్ష్మి తెలిపారు. ఏడాది కాలానికి రూ. 1. 50 లక్షలు బాండ్ విలువకు బైండోవర్ చేసినట్లు వివరించారు. ఏడాది కాలంలో ఎటువంటి నేరాలకు పాల్పడినా బాండును అనుసరించి వారిపై పెనాల్టీ విధించి ప్రభుత్వ ఖజానాకు సొమ్మును జమ చేస్తామన్నారు.