పెరవలి మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జి ఎంపీడీవో ఎస్. రమేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 - 25వ సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం పనులు గుర్తింపుపై ఈ సభలు జరుగుతాయన్నారు. గ్రామ సభల నిర్వహణకు పరిశీలకులను నియమించినట్లు వివరించారు. అధికారులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.