ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సేవలందిస్తున్న ఏకైక సంస్థ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అని ఆ సంస్థ జిల్లాధ్యక్షులు మోహన్ రావు అన్నారు. తాడేపల్లి గూడెం పట్టణంలోని బుద్ధాల కన్వెన్షన్ హాల్లో ఆదివారం మానవత సంస్థ తాడేపల్లిగూడెం శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాగిరాజు జానకిరామరాజు, తదితరులు పాల్గొన్నారు.