తాడేపల్లిగూడెం ఎంవీఆర్ గ్రాండ్‌లో శనివారం జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, సర్పంచ్ ఖండవల్లి మణిరాజు, మాజీ ఎంపీటీసీలు కట్టుబోయిన కృష్ణ ప్రసాద్, గుమ్మళ్ల రత్నరాజు, మాజీ సర్పంచ్ కట్టుబోయిన భాస్కరరావు, కుదుళ్ల భాస్కరరావు జనసేనలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.